02-05-2025 01:45:01 AM
నిజామాబాద్, మే 1 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ 6 టౌన్ నుంచి జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్‌ను సీపీ సాయిచైతన్య సస్పెండ్ చేశారు. కోర్టులో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్, తాత్కాలిక ప్రాపర్టీ విడుదల కేసులలో క్లైంట్ల నుంచి గజానంద్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు టౌన్ 6 పోలీస్ స్టేషన్లో ఈ కానిస్టేబుల్‌పై కేసు కూడా నమోదు అయింది. గజానంద్ జాదవ్ ప్రయివేటు చీటీల యాజమాన్యాల సహకారంతో పలు చీటీలు వేసి మోసపూరితంగా.. తన తోటి సిబ్బందిని, మిత్రులను గ్యారంటీరులుగా పెట్టించుకుని, తిరిగి డబ్బులు కట్టకుండా వారిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి నిజామాబాద్ 4వ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయింది. విచారణలో గజానంద్ మోసాలు వెలుగు చూడటంతో సీపీ ఎట్టకేలకు కానిస్టేబుల్‌పై వేటు వేశారు.