09-09-2025 12:00:00 AM
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 8:వికలాంగులు, వృద్ధులు, గీత, నేత, బీడీ కార్మికుల పెన్షన్ల పెంపు కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట కలెక్టరే ట్ కార్యాలయం ఎదుట మహా ధర్నా జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పెన్షన్తో జీవనం కొనసాగించడం కష్టమైందని పేర్కొన్నారు.
కనీసం వికలాంగులకు రూ.6,000, వృద్ధులకు, గీత-నేత, బీడీ కార్మికులకు రూ.4,000, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు రూ.15,000 పెన్షన్ మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.విహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, వికలాంగులకు విద్యా రంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు, ఉచిత వైద్యం, స్వ యం ఉపాధి రుణాల్లో సబ్సిడీ, గృహ నిర్మాణం, భూమి కేటాయింపులో ప్రత్యేక కోటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆం దోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో-ఇంచార్జి మల్లిగారి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు, విహెచ్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ చిట్టెల సంపత్, ఎంఎస్పీ జిల్లా ప్రతినిధి చుంచు రమేష్, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల లక్ష్మణ్, ఎమ్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.