calender_icon.png 4 November, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు మానుకోవాలి

04-11-2025 12:20:28 AM

  1. కుంట్లూరు గ్రామస్తులు, పలు కాలనీల ప్రజలు
  2. ప్లాంట్ ఏర్పాటు వలన మానవాలికి ప్రమాదం

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 03: ఎస్టీపీని వ్యతిరేకిస్తూ కుంట్లూరు గ్రామస్తుల తోపాటు కనకదుర్గానగర్, భవానీనగర్, ప్రజ గుల్‌మహార్, జూబ్లీ నగర్, షిరిడీ సాయినగర్, రాఘవేంద్ర తదితర కాలనీల ప్రజలు రోడ్డెక్కి ప్లాంట్ ఏర్పాటును మానుకోవాలని ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధి కుంట్లూరు రెవెన్యూ 107 సర్వేనంబర్‌లోని కుంట స్థలంలోకి హెఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఎస్టీపీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సోమవారం అక్కడి సమీప కాలనీల ప్రజలు  పెద్ద అంబర్‌పేట్ కుంట్లూరు రహదారిపై ఆందోళనకు దిగారు. మహిళలు, వృద్ధులు సైతం రోడ్డెక్కారు. ఎస్టీపీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రజ ఆమోదం లేకుండానే కాలనీల సమీపంలో ఎస్టీపీ ఏర్పాటు చేయాలని ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. దీన్ని ప్రభుత్వం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.

ప్రశాంత వాతావరణం కోసం ఊరికి దూరంగా వచ్చి ఇల్లు నిర్మించుకుంటే అక్కడ ఎస్టీపీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై మండిపడ్డారు. ఎస్టీపీ మాకొద్దు, పార్కులు కడితేనే మద్దతు అంటూ నినాదాలు చేశారు.  ప్లాంట్ ఏర్పాటు వలన మానవాలికి ప్రమాదం పొంచి ఉందన్నారు. హయత్ నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళను చేస్తున్నవారిని సముదాయించారు. 

కార్యక్రమంలో కాలనీల ప్రతినిధులు పురుషోత్తం, రవికుమార్, పరమేశ్వర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మురళి, మహేందర్‌రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, జోర్క రాము ముదిరాజ్, పెద్దింటి శ్రీనివాస్ రెడ్డి, మాడుగుల వెంకటేశ్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.