calender_icon.png 19 May, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇందిరమ్మ నమూనా ఇంటి’ నిర్మాణ పనులు వేగవంతం

19-05-2025 12:00:00 AM

వీడుతున్న అధికారుల మొద్దు నిద్ర

పెన్‌పహాడ్, మే 18 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రములోని తహసీల్దారు కార్యాలయం వక్కనే నిర్మిస్తున్న (అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇందిరమ్మ నమూన ఇంటి నిర్మాణ పనులు సా..గుతున్నాయని) ఇటీవల ’విజయక్రాంతి’ దిన పత్రి కలో ’ఇందిరమ్మ నమూన.. ఇకనైనా పూర్తయ్యేనా..?’ అనే శీర్షిక ప్రచురితం అయింది.

ఇల్లు లేని నిరుపేద ప్రజలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులు మొద్దు నిద్ర మూలంగా తూట్లు పొడుస్తున్నారని, అలాగే నెలల తరబడి చేపడుతున్న ఇందిరమ్మ నమూన ఇల్లు బడ్జెట్ లేక పోవడం వల్లనే నిర్మాణ పనులు ఆగిపోయాయని మండల ప్రజల సందేహలు..

అంతేకాకుండా గృహనిర్మాణ శాఖ ఆద్వర్యం లో నమూన ఇల్లు నిర్మాణ పనులు సకాలంలో చేపట్టాల్సి ఉండగా కాసుల కక్కుర్తి మూలంగా ఇతరులకు కాంట్రాక్టు ఇవ్వడం మూలంగా పర్యవేక్షణ కొరవడడంతో ఇందిరమ్మ నమూన ఇల్లు మొండిగోడలకే పరిమితం అయిందని లబ్దిదారులు, మండల ప్రజలు ఆరోపనలు విజయక్రాంతి దృష్టికి తీసుకురాగా పలు అంశాలతో శీర్షిక ప్రచురితం చేసింది.

ఈమేరకు జిల్లా ఉన్నత అధికారులు మొట్టి కాయలు వేయగా గృహ నిర్మాణ శాఖ అధికారుల మొద్దు నిద్ర వీడడంతో ఇందిరమ్మ నమూన ఇల్లు మొండి గోడల నుండి స్లాబ్ లెవల్ కు చేరింది. అధికారుల నిర్లక్ష్యం విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావడం తో ఇందిరమ్మ నమూనా ఇంటి పనులు నేడు వేగవంతం అయ్యాయని ’విజయక్రాంతి’కి పలువురు అభినందనలు తెలిపారు.