19-05-2025 12:00:33 AM
-నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ కేసులో తాత్సారం
-పొరుగు రాష్ట్రాల్లోనూ పోగేసిన ఆస్తులు
-మరింత లోతుగా విచారణ చేయాలని డిమాండ్
నిజామాబాద్ మే 18: (విజయ క్రాంతి): నిజామాబాద్ రెవెన్యూ విభాగం మున్సిపల్ అవినీతి తిమింగలం దాసరి నరేందర్ అక్రమాస్తుల కేసు నీరుగారిచే ప్రయత్నం జరుగు తుందని చర్చ జరుగుతోంది.
ఇందుకు కార ణం దాసరి నరేందర్ అవినీతి ఆరోపణపై లోతుగా దర్యాప్తు జరగకపోవడమే అన్న సమాధానం వస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ ఆర్ వో గా పనిచేసిన దాసరి నరేందర్ ఇంట్లో కోట్ల రూపాయలు కళ్ళు చెదిరే నగలతో ఏసీబీ అధికారులు అతని నివాసంలో దాడులు జరిపి పట్టుకున్నారు ఈ విషయం విధితమే.
దాసరి నరేందర్ ఇంట్లో దొరికిన నగదు లెక్కించేందుకే అధికారులకు ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. ఇతని ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు కళ్ళు చెదిరే సంపద అక్రమంగా పోగేసిన కోట్లకు పైగా ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లు నోట్ల కట్టలు నగలు నగదు చూసి ఏసీబీ అధికారులు బిత్తర పోయారు.
విదేశాల్లో సైతం స్టార్ హోటల్లు ఉన్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం. నిర్మల్. కొంపల్లి తోపాటు బెంగళూరు చెన్నైలలో ఆస్తులు ఉన్నట్టుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. కోట్ల రూపాయలకు పడగలెత్తిన ఈ అవినీతి తిమింగలంపై లోతుగా విచారణ జరిపి అక్రమ ఆస్తులను నీగ్గు తేల్చాలని దాసరి నరేందర్ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గుట్టల కొద్ది నోట్ల కట్టలు కోట్ల రూపాయల్లో ఆస్తులు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు మున్సిపాలిటీ లో పనిచేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదన చూసిన ఏసీబీ అధికారుల కండ్లు బైరులకు అమ్మాయి. దశాబ్ద కాలంగా మున్సిపల్ లో అతను చెప్పిందే శిలాశాసనం గా మారింది ఆడింది ఆట పాడిందే పాట ప్రతి పనికి మరీ వెలగట్టి ముక్కు పిండి వసూలు చేశాడు.
తన అవినీతి కేసు నుండి బయట వేయాలని కోట్ల రూపాయల మూటతో ప్రముఖ రాజకీయ నాయకుల ను ప్రసన్నం చేసుకునే నీలో ఈ అవినీతి తిమింగలం నిబంధన అయినట్టు విశ్వాసనీయ సమాచారం. తన అవినీతిలో పలువురు ఐఏఎస్ ల వాటా కూడా ఉన్నట్టు ఏసీబీకు పట్టుబడిన అవినీతి తిమింగలం తెలిపినట్టు తెలుస్తోంది.
విశ్వాసనీయ సమాచారం న్యాయ పరంగా పరిష్కారంలో కోర్టులలో తగాదాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా న్యాయస్థానాల తీర్పులకు ఇచ్చే డిగ్రీలను కూడా లెక్క చేయకుండా అవినీతికి పాల్పడి ఇష్టానుసారంగా వ్యవహరించాడు అక్రమార్కులకు అంట కాగి కోట్ల కొద్ది రూపాయలు కిలోల కొద్ది బంగారం లెక్కలేనన్ని స్థిరాస్తులు పంట పొలాలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంపాదించాడు అక్రమార్గమే ధ్యేయంగా పెట్టుకున్న దాసరి నరేందర్ సంపదన లెక్కించడానికి ఏసీబీ అధికారులకు ఐదు గంటలకు పైగా సమయం పట్టిందంటే సార్ వారి అక్రమ సంపాదన ఏ మేరకు ఉంటుందో తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని దాసరి నరేందర్ ఇంట్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఆస్తి 6.07 కోట్లుగా గుర్తించి వాటిని సీజ్ చేశారు నగదు ఆభరణాలు బ్యాంకు బ్యాలెన్స్ లు ఆస్తి పత్రాలు సీజ్ చేశామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లోని దాసరి నరేందర్ చాంబర్ నుంచి 90 వేల నగదు స్వాధీనం చేసుకుందామని అధికారులు తెలిపారు.
దాసరి నరేందర్ ఉన్నతాధికారులను సైతం మజ్జిగ చేసుకుని వారి నీడలోనే ఈ తతంగమంతా సాగించినట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల నిజాంబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఒక అధికారికి మూడు కోట్లలోరూ పాయలు మరొక అధికారికి రెండు కోట్ల యాభై లక్షలు.
గతంలో ప్రభువు వాక్యంతో స్వచ్ఛ పాలన చేసిన ఒక కమిషనర్ కి కోట్ల కొద్ది రూపాయలు లావాదేవీలు జరిపి అతని కూడా డబ్బులు భారీగానే చెల్లించినట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో మున్సిపల్ అవినీతి తిమింగలాన్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నరేందర్ ను అరెస్టు చేసి హైదరాబాదులోని చర్చలు కూడా జైలుకు రిమాండ్కు తరలించారు.
ఇటీవల బెయిల్ పై విడుదలైన దాసరి నరేందర్ తన కేసు నీరు కార్చే కార్యక్రమానికై రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తన కేసుని పరిష్కరించే దిశగా సహకరిస్తే భారీగా ముట్టజెప్పేందుకు నగదును సమకూర్చుకొని ప్రయత్నాలు ప్రారంభించినట్టు విశ్వాసనీయ సమాచారం.
అతని సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేను కలిసి అతని ద్వారా రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. ఇతని ఇంట్లో 11 గంటలకు పైగా సోదా చేసిన ఏసీబీ అధికారుల తనిఖీల్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి కౌంటింగ్ మిషన్లో లెక్కించేందుకు సిబ్బంది నాన తంట లు పడ్డారు మెదక్ జిల్లాకు చెందిన 25 మంది అధికారులతో కూడిన బృందాలు నరేందర్ ఇల్లు చాంబర్ తో పాటు కోటగల్లి లో ఉండే తల్లినివాసం నిర్మల్ జిల్లాలోని అత్తగారింట్లో సోదరులు నిర్వహించి 2.98 కోట్ల నగదు తో పాటు ఆరు లక్షల రూపాయలు విలువచేసే 51 తులాల బంగారం ,1.98 కోట్ల విలువచేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే భార్య తల్లి పేరుట బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ 1.10 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.
అక్రమ పట్టా ల దందాలో కూడా మున్సిపల్ నరేందర్ పేరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను కార్పొరేషన్ పరిధిలో నీ ప్రజలను నిలువునా దోచుకున్న అవినీతి తిమింగలం నరేందర్ కేసు నీరు గారిచే ప్రయత్నం మొదలైందనే చెప్పవచ్చు.
జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు నరేందర్తో అంట కాగిన అవినీతి తిమింగలాల అందరిని కూడా అధికారులు విచారించి వారిపై కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవలే నగరం ఎంట్రన్స్ లో కాల్వకు పక్కన వెలిసిన ఒక వస్త్ర దుకాణనికి సంబంధించి కోట్ల రూపాయల్లో టెక్స్ ఉండగా అందినంత దండుకొని తూతూ మంత్రంగా టాక్స్ విధించారు.
ఇది జగమెరిగిన సత్యం. పదేళ్లుగా బల్దియాలో పాతుకుపోయిన నరేందర్ బల్దియా కొచ్చిన కమిషనర్లను ఎమ్మెల్యేలను సైతం బోల్తా కొట్టించి తన అవినీతిలో వాళ్లను కూడా భాగస్వామ్యం చేశాడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నరేంద్ర అవినీతి దందాపై మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ప్రజలు ఫిర్యాదు చేసినప్ప టికీని కార్పొరేటర్లు సైతం నరేందర్ హాయ్ సిరియాల చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
దీంతో నరేందర్ అక్రమ దందా కు అడ్డు అదుపు లేకుండా పోయింది. మున్సిపల్ అవినీతి తిమింగలం నరేందర్ అవినీతి అక్రమార్జనపై సరైన దర్యాప్తు జరగడం లేదని కోట్ల రూపాయల ఆస్తులు ఇటీవల బినామీలపై ఆయన కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ లు పొలాలు ముంబై పూణే నాగపూర్ ఆదిలాబాద్ నిర్మల్ బెంగళూరు లలో స్థిరాస్తులు ఉన్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది.
నరేందర్ పెట్టుబడులు అతనితో అంటగాగిన ఐఏఎస్ కమిషనర్ స్థాయి అవినీతి అధికారుల చిట్టా కూడా అధికారులు చేదించాల్సింది. మనీ లాండరింగ్ పై విచారణ జరగాల్సిందే నరేందర్ కొల్లగొట్టిన కోట్ల రూపాయల చేతులు మారిన విషయమై మనీ లాండరింగ్ జరిగిన దిశగా విచారణ జరగాల్సి ఉంది.
మున్సి పల్ అవినీతి తిమింగలం దాసరి నరేందర్ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ డి దాసరి నరేందర్ అవినీతి బాగోతంపై నిజామాబాద్ ఏసీబీ అధికారులను వివరాలు కోరింది ఈ మేరకు అవినీతి ఈరోజు ఒక శాఖ అధికారులు నరేందర్ అవినీతి దందాపై పట్టుబడిన స్థిర ఆస్తులతో పాటు నగదు నగల వివరాలను ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు నివేదించింది.
ఏ ఫైలులో అవినీతికి పాల్పడ్డాడు మున్సిపల్ కార్పొరేషన్ కి ఎంతవరకు నష్టం వాటిల్లింది అతని పనితీరు వల్ల ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది ప్రభుత్వ మున్సిపాలిటీకి విరుద్ధంగా నిబంధనలను పాటించకుండా అతను ఇచ్చిన అనుమతులు ఏంటి అసలు ముంతకీలు చేసిన ఆస్తుల వివరాలు ఏంటి పదేళ్లపాటు జరిగిన ఈ అవినీతిపై అతని ద్వారా క్లియరెన్స్ అయిన ప్రతి ఫైలు పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.
కేసు నమోదు నెలలు గడుస్తున్నప్పటికీ నరేందర్ ఉన్నతాధికారులను ఐఏఎస్ స్థాయి అధికారులను రాష్ట్రస్థాయి అధికారులను బురిడీ కొట్టించి సంతకాలు చేయించిన దస్త్రాలు అవినీతి అధికారుల అదుపులో ఉన్నాయా లేవా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది ఈ కేసును మరింత లోతుగా పూర్తిగా ఉన్నత స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దాసరి నరేందర్ అవినీతి కేసులో మనీ లాండరింగ్ జరగలేదని వాదన వినిపిస్తోంది. నిత్యం లక్షల్లో లంచం డబ్బులు వెనుక వచ్చిన దాసరిని నరేందర్ మనీ లాండరింగ్ కు పాల్పడలేదంటే నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా మనీ ల్యాండరింగ్ జరిగే ఉంటుంది. మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడి అధికారులు కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అవినీతి తిమింగలానికి శిక్షపడేలా చేయాల్సిన అవసరం ఉంది.