28-05-2025 01:19:58 AM
క్లీనర్ మృతి...్రడైవర్‌కు తీవ్ర గాయాలు
పటాన్ చెరు, మే 27 : ఆగివున్న లారీని వెనక నుంచి కంటైనర్ డీకొట్టడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళ వారం తెల్లవారు జామున బొల్లారం శివారు లోని ఓఆర్‌ఆర్ పై జరిగింది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు... బీదర్ జిల్లా కమాల్ నగర్ బసవేశ్వర్ చౌక్ కు చెందిన హిజాజ్(36) లారీ క్లీనర్ గా పని చేస్తున్నాడు.
ఓఆర్‌ఆర్ పై లారీ టైర్ పంచర్ కావడంతో మంగళవారం తెల్లవారు జామున్న టైర్ విప్పుతున్న క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీని డీకొట్టింది. దీంతో క్లీనర్ హిజాజ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ ఇక్బాల్ భగవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతిని బంధువు ఎస్ కే అబేద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుసీఐతెలిపారు.