23-12-2025 01:58:30 AM
అదృష్టం వరించిన కందుల వెంకటేశ్వర్లు
అంజనాపల్లి గ్రామ మొదటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక
కుషాయిగూడ, డిసెంబర్ 22 (విజయక్రాంతి): నల్ల గొండ జిల్లా అంజనాపల్లి గ్రామ సర్పంచ్‌గా ఒకప్పుడు జీవిత ఖైదు అనుభవించిన కందుల వెంకటేశ్వర్లు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొం దారు. వివరాలు.. వెంకటేశ్వరు 2003లో ఓ హత్య కేసులో చర్లపల్లి జైలుకు జీవిత ఖైదీగా వచ్చారు. జైలు అధికారుల ఆదరాభిమానాలు పొందడమే గాక..2011లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి కందుల వెంకటేశ్వర్లు విడుదలయ్యారు అప్పటినుంచి నల్లగొండ జిల్లాలో ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కయ్యారు.
సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచిగా నిలిచారు. 98 ఓట్లతో గెలిచి విజయ్ కేతనం ఎగురవేశారు. నాడు చర్లపల్లి జైల్‌లో జీవిత ఖైదీగా ఉండే కందుల వెంకటేశ్వర్లు నేడు సర్పంచిగా గెలుపొందడంపై తోటి ఖైదీలు చర్చించుకోవడం కొసమెరుపు.