22-12-2025 12:59:29 AM
ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్, డిసెంబర్ 21(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడటం అంటే దేశంలో పేదల హక్కులను కాపాడటమే అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షత భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశంలోని పేద, గ్రామీణ, శ్రమజీవి ప్రజలకు ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో తీసుకువచ్చిన అత్యంత ప్రజాప్రయోజనకరమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని స్పష్టం చేశారు.
2005లో పార్లమెంటులో చట్టరూపం దాల్చిన ఈ పథకం 2006 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చి, ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 5 వేల కోట్ల పని దినాలను కల్పించిన ఏకైక పథకంగా చరిత్ర సృష్టించిందన్నారు. సుమారు 14 కోట్ల మంది కూలీలు, పేదకుటుంబాలు ఈ పథకం కింద నమోదు చేసుకుని ఉపాధి పొందుతున్నారని, ఇప్పటివరకు గ్రామీణ భారతదేశానికి 11 లక్షల 75 వేల కోట్ల రూపాయలకు పైగా వేతనాలు నేరుగా కూలీల ఖాతాల్లో జమ అయ్యాయని వివరించారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు గణనీయంగా తగ్గాయని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కలిగిందని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని చెప్పారు.
కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్,ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, ఐఎన్టీయుసి రాములు యాద వ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, సంజీవరెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, టంకర కృష్ణయ్య, శేఖర్ నాయక్, సిజె బెనహర్, ఫయాజ్, మైత్రి యాదయ్య, సేవాదళ్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, అజ్మత్ అలి, అర్షద్ అలి , ప్రవీణ్ కుమార్, మోయీజ్ వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు వార్డు సభ్యులు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.