15-06-2024 12:05:00 AM
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు విద్యనందించాలి. రాష్టంలో ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలను తీసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
వి.రాజశేఖర్ శర్మ , నాగర్ కర్నూల్ జిల్లా