calender_icon.png 22 November, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీపై సుల్తానాబాద్‌లో సంబురాలు

18-08-2024 12:05:36 AM

 ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): రైతురుణమాఫీపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో శనివారం సంబురాలు నిర్వహిం చారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణావు పాల్గొని పభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకున్నదన్నారు. కొందరికి సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాలేదని, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంత రం ఆర్యవైశ్య భవన్‌లో సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.