calender_icon.png 22 November, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించం

18-08-2024 12:04:37 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రైతులను బ్యాంకు అధికా రులు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హెచ్చరించారు. శనివారం బెజ్జుర్ మండల కేంద్రంలోని ఏడీసీసీ బ్యాంక్‌ను సందర్శించారు. గతంలో పీఎసీఎల్‌లో జరిగిన అవినీతిని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డీసీసీబీ సీఈవోను ఎమ్మెల్యే కోరారు. బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జరిగిన అవినీతిని బయటకు తీసుకువచ్చేందుకు కో ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తామన్నారు. రైతులకు మంజూరు అయిన రుణమాఫీ ఇతర లోన్‌లో కటింగ్ పెట్టితే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు. ఆయనవెంట ఎంపీడీవో గౌరిశంకర్, డీటీ బీమ్లానాయక్, మాజీ ఎంపీపీలు మనోహర్‌గౌడ్, కొప్పుల శంకర్, నాయకులు ఉన్నారు.