12-08-2025 12:40:48 AM
సహకార సంఘం భవనం, సహకార బ్యాంకు బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
కమాన్ పూర్, ఆగస్టు-11 (విజయ క్రాంతి) గ్రామీణ రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగ పడాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.సోమవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో రూ. 65 లక్షలతో నిర్మించిన నూతన పి.ఎ.సి.ఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవనాన్ని, 79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని,
కరీంనగర్ డి.సి.సి.బి చైర్మన్ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ మండలంలో సహకార బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా రైతులకు సహకార సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం లో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని,జిల్లా స హకార కేంద్రం బ్యాంక్ బ్రాంచ్ నందు డిపాజిటర్లకు, కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందన్నారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాం కులు ఉపయోగ పడతాయని,రైతుల సంక్షే మం దృష్ట్యా సహకార బ్యాంకులో దోహదపడతాయని, రైతులకు అందుబాటులో ఉం డే విధంగా కమాన్ పూర్ మండల కేంద్రం లో సహకార బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ డి.సి.సి.బి చైర్మన్ రవీం దర్ రావు మాట్లాడుతూ కమాన్ పూర్ మం డలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని, సహకారం బ్యాంక్ బ్రాం చ్ భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు.
కేంద్ర సహకార బ్యాంకులో 72 శాఖలు ఉంటే 32 భవనాలు నిర్మించుకోవడం జరిగిందని, సహకార సొసైటీ ద్వారా కూడా భవనాలు బ్యాంకుకు అద్దె ఇవ్వడం జరుగుతుందని, గతంలో రూ. 70కోట్ల నష్టం 400 కోట్ల వ్యాపారంతో ఉన్న సహకార బ్యాంకును నేడు 7200 కోట్ల వ్యాపారం, 120 కోట్ల లాభాలతో నడిచేలా అభివృద్ధి చేశామని, ప్రతి సంవత్సరం కస్టమర్లకు వాటాదారులకు బోనస్ కూడా అందిస్తున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, పీఏసీఎస్ చైర్మన్ భాస్కరావు, ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, బంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు వనం రాంచందరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.