19-09-2025 12:00:00 AM
30 ఇసుక ట్రాక్టర్లు సీజ్
హుజూరాబాద్, సెప్టెంబర్18:(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను, సరైన ధృవ పత్రాలు లేని మరో 14 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. ఈ తనిఖీల ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. గ్రామంలో అనుమానితుల కదిలికలు ఉంటే పోలీసులకు సమాచారమివ్వాల న్నారు. అలాగే, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్త్స్రలతో సహా 50 మంది పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.