30-01-2026 12:50:48 AM
షాద్‌నగర్, జనవరి 29(విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర కాలనీ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో అదేవిధంగా ముందస్తు శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పోలీసులు చేపట్టారు. పట్టణ సీఐ విజయకుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఇంకా పెద్ద ఎత్తున సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు.