30-01-2026 12:50:21 AM
ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీలు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : తెలంగాణలో చలి తీవ్రత కొనసా గుతున్నది. పగలు ఎండగా ఉంటున్నప్పటికీ రాత్రులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠంగా 13.2 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠంగా 32.3 డిగ్రీలుగా రికార్డయింది. మెదక్ జల్లాలో 15.5 డిగ్రీలు నమోదైంది. ఈ మేర కు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొం ది. మరో నాలుగు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.