calender_icon.png 4 October, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

04-10-2025 12:09:35 AM

  1. జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
  2. మహాత్మునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి

ఆదిలాబాద్, అక్టోబర్ 03 (విజయక్రాంతి) : మహనీయుల అడుగుజాడల్లో నడిచి, దేశాభివృద్ధికి పాటుపడాలని ఆదిలాబాద్ జిల్లా రాజర్షి షా అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కుల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్ లు జిల్లా జైలు ను సందర్శించి, ఖైదీలతో కలిసి మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

అటు మహాత్మా గాంధీజీ కలలకు అనుగుణంగా ప్రధాని మోడీ సుపరి పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు.  ప్రపంచానికి మార్గదర్శకులుగా గాం ధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జీ నిలిచారని కొనియాడారు. అటు అహింసా మార్గం ద్వారానే దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆ మహాత్ముని విగ్రహానికి బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.