calender_icon.png 4 October, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరావేడుకల్లో అపశృతి

04-10-2025 12:09:26 AM

డీజే ట్రాలీ కిందపడి బాలుడు దుర్మరణం 

మహబూబా బాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో దసరా వేడుకల్లో అపశృతి దొర్లింది. జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపురం గ్రామంలో దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే ట్రాలీ కింద పడి నాలుగేళ్ల బాలుడు జశ్వంత్ మృతి చెందాడు. డీజే వద్ద డాన్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ట్రాలీ క్రింద పడగా గ్రామస్థులు గమనించి తల్లిదండ్రులకు తెలియజేయడంతో బాలుడిని వారు మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.