calender_icon.png 19 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి

19-08-2025 12:00:00 AM

గద్వాల నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు

గద్వాల రూరల్, ఆగస్టు 18:స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ ఆత్మగౌరవం మరియు ధైర్యసాహసాలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిహ్నంగా నిలిచారని గద్వాల ని యోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు అన్నా రు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి,ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ,సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మోనేష్, బీచుపల్లి, రాజా రెడ్డి, గంజిపేట రాజు, పార్టీ నాయకులు,కార్యకర్తలు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.