21-05-2025 01:02:28 AM
సీఎం ఇంటి ఎదుట ధాన్యం పోసి ధర్నా చేస్తాం
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
తొర్రూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
తుర్కయంజాల్, మే 20.యాసంగిలో ధాన్యం మీదనే రాష్ట్ర ప్రభుత్వం రూ.16వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని, ప్రపంచం లో ఇంతకంటే ఘోరం మరోటి ఉండదని భువనగిరి మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ ఆరోపించారు. ధాన్యానికి కేంద్రం ఇచ్చే రేటు ను ఇవ్వకపోతే కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తామన్నారు. రెండురోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం ఇంటి ఎదుట ధాన్యం పోసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులో ధాన్యం కొనుగోలు కే్ంర దాన్ని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి, నాయకులతో కలిసి బూ ర నర్సయ్యగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల ఎదుట రైతులు తమ గోడును వెళ్ల బోసుకున్నారు. క్వింటాకు 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలకు లారీ వచ్చిన రోజే ధాన్యం వెళ్తోందని, మిగతా రోజుల్లో ఎండకు ఎండి, వానకు తడిసి లాస్ అవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంత రం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ తో కలిసి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ కు అందాలరాసుల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం రాశుల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ఉత్తర ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.
కోటిమంది మహిళలను కో టీశ్వరులను చేస్తామని రేవంత్ అనడం వి డ్డూరంగా ఉందన్నారు. కూటిలో రాళ్లు తీ యలేనోడు ఏటిలో రాళ్లు తీస్తాడా అంటూ నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతుల దగ్గర అడ్డికి పా వుశేరుకు కొంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే కు ఏమీ తెలియదు, కలెక్టర్ పట్టించుకోరు, ముఖ్యమంత్రి, మంత్రులు అందాల భామల చుట్టూ తిరుగుతూ రైతులను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్వింటాకు ఎనిమిది కిలోలు తరుగు తీస్తుండటంతో రై తులు గోసపడుతూ, రేవంత్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. క్వింటాకు రూ.2200 ఇవ్వాల్సింది పోయి, రూ. 1600లే ఇస్తూ, రూ.600 కొట్టేస్తున్నారని దు య్యబట్టారు. రైతులకు ప్రతి రూపాయి కేంద్రమే ఇస్తోందని, బోనస్ కూడా కేంద్రమే భరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం దళారీ పాత్రమే పోషించాల్సి ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పోరెడ్డి అర్జున్ గౌడ్, బీజేపీ క్రమశిక్షణా సంఘం స భ్యులు బోసు పల్లి ప్రతాప్, నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర నాయకులు బచ్చిగళ్ల ర మేష్, పురుషోత్తం, అర్జున్ గౌడ్, రాంరెడ్డి, బలదేవరెడ్డి, బాలకృష్ణగౌడ్, బాల్‌రెడ్డి, నక్క రవీందర్ గౌడ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.