21-05-2025 01:02:55 AM
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
నిజాంపేట(రామాయంపేట), మే 20: నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి కల్యాణ మహోత్సవానికి మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి నిజాంపేట్ మండల నాయకులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలపై రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.
నిజాంపేట్ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బాపురెడ్డి,మాజీ సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపీటీసీ లు బాలురెడ్డి, భాస్కర్ రావు, వెంకట స్వామి, మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజిజ్, గౌస్,నాయకులు దుబ్బ రాజ గౌడ్, వెంకట్ గౌడ్, నగేష్ యాదవ్, మోహన్ రెడ్డి, నాయిని లక్ష్మణ్, రంజిత్,మహేష్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.