22-12-2025 12:00:00 AM
వాంకిడి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు క్వింటాళ్ల పత్తి దగ్ధమైన ఘటన వాంకిడి మండలంలోని జైత్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. జైత్పూర్ గ్రామానికి చెందిన రైతు జాబోరే గణపతి తను పండించిన పత్తి పంటను ఇంట్లో అమ్మకానికి నిలువ ఉంచాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఇంట్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా నిల్వ చేసిన సుమారు నాలుగు క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని కుటుంబీకులు తెలిపారు. దాదాపుగా 30 వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.