calender_icon.png 29 October, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 12:07:14 AM

  1.   20 శాతం తేమ ఉన్నా కోనాలని కేంద్రాన్ని కోరాం
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరావు 
  3. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల మంగళవారం సచివాలయం నుంచి ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మాట్లాడారు. వారి సందేహాలు నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పత్తి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా సీసీఐ ద్వారా 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లకు ప్రారంభించామని తెలిపారు. కాగా, సోమవారం 72 జిన్నింగ్ మిల్లులలో 784 మంది రైతులకు చెందిన 1,623 మెట్రిక్ టన్నుల పత్తి కొన్నామని తెలిపారు.

పత్తి క్వింటాలు మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ‘కపాస్ కిసాన్’ యాప్‌లో  పత్తి రైతులు నమోదు చేసుకుని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సమస్యలంటే రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779కు సంప్రదించాలని సూచించారు. సోయాబీన్ కొనుగోళ్లు కూడా మంగళవారం నుంచే  ప్రారంభమయ్యాయని, ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌లో మొక్కజొన్న, జొన్నలు చేర్చాలని సోయాపై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు.