30-12-2025 01:16:43 AM
నల్లగొండ జిల్లా చండూరులో రైతుల ఆందోళన
చండూరు, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పత్తి కొనాలంటూ నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బంగారి గడ్డ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. బంగారిగడ్డ ప్రధాన రహదారి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పత్తి పంటను తీసుకోబోమని మిల్లు యజమానులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వాహనాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే, తీరా పత్తిని కొనుగోలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని సర్ది చెప్పారు.