calender_icon.png 30 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగ రోదన!

30-12-2025 01:17:39 AM

పట్టణ నడి బొడ్డే కేంద్రంగా అక్రమ రవాణా

యథేచ్ఛగా పశువుల తరలింపు

సంతలే క్రయ, విక్రయకేంద్రాలు

నిబంధనలు పట్టని, వైనం

చోద్యం చూస్తున్న అధికారులు 

మణుగూరు, డిసెంబర్ 29, (విజయక్రాంతి): మండల కేంద్రంగా పట్టణం మీదు గా పశు అక్రమ రవాణా సాగడం తొలిసారి కాదు. కొన్నేళ్లుగా రాత్రి వేళల్లో పశువులను యథేచ్ఛగా తరలిస్తున్నారు. పట్టణ నడి బొ డ్డుగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా భారీ వాహనాల్లో పరిమితికి మించి పశువులను ఎక్కిస్తూ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నా రు. అనేకసార్లు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా. ఆ వ్యాపారాల వైఖరిలో మార్పు కనిపించడం లేదు. హైందవ సంఘాల బగ్గుమంటున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయ కుని అండా, దండాలతో చెలరేగబోతున్నా రు. మండల కేంద్రంలో సాగుతున్న గోమా త మూగ రోదనఫై విజయక్రాంతి కథ నం ..

పట్టణమే కేంద్రంగా..

పట్టణ నడిబొడ్డే కేంద్రంగా అక్రమ రవాణా సాగుతుంది. మణుగూరు పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గ్రౌం డ్ అక్రమ పశు రవాణకు అడ్డాగా మారింది. సమీపంలో గ్రామాల నుండి అక్కడ వ్యాపారులు దళారులను ఆశ్రయించి పశువుల కం టైనర్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా రు. ఇదే సమయంలో ఒడిశా రాష్ట్రంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పశువుల ను తరలించేటప్పుడు కొన్నిచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏదేమై నా బహిరంగంగా ఈ దందా కొనసాగిస్తూ.. కొందరు అక్రమార్కులు లక్షలాది రుపాయలు ఆర్జిస్తున్నారు. ఎటువంటి అనుమతు లు లేకుండా పశువులను రవాణా చేస్తున్నా ఉన్నతాధి కారులు స్పందించకపోవడంపై వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిసారీ పశు అక్రమ రవాణాను అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడంతోనే సరిపె డుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అందు బాటులో గో సంరక్షణ శాలలు లేక పోవడంతో తిరిగి యజమానులకే పశువులను అప్పగించాల్సి వస్తోందని వారుసమాధానం చెబుతున్నా రు. మొత్తంగా ఈ అంశమే అక్రమార్కులకు కలిసొస్తుంది.  వేలాదిగా పశువులను కబేళాలకు తరలిస్తూ.. లాభాలు ఆర్జిస్తు న్నారు. ఇ ప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి తగు చర్య లు తీసుకోవాలని పట్టణ వాసు లు కోరు తున్నారు. 

సంతల్లోనే.. 

గతంలో కేవలం రైతులే పశువుల కోసం సంతలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం వ్యవసాయంలో యంత్రికీకరణ పెరగడంతో పశు సంపద తగ్గింది. దీంతో చర్ల నుంచి పశువులను మల్లెపల్లి సమీపంలో ఉన్న గోదావరి తీరం తరలించి, అక్కడి నుండి పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌండ్ నే కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రతి గురువా రం, ఆదివారం వందల సంఖ్యలో పశువుల అక్రమ రవాణా సాగిస్తున్నారు. శుక్రవారం కాలినడకన కొన్ని, వాహనాల్లో మరి కొన్నింటిని తరలిస్తుంటారు. మొత్తంగా శనివారం హైదరాబాద్ కు తరలివెళ్తున్నాయి.

పశు వ్యాపారికి అధికార పార్టీ నేత అండ దండ..

 మండల కేంద్రంగా సాగుతున్న అక్రమ పశువు రవాణా వెనక ఓ అధికార పార్టీ నా యకుని హస్తం బలంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మణుగూరు నుండి ము లుగు, ఆక్కడి నుండి హైదరాబాద్ తలించే వరకు, నిన్న కాకా మొన్న అధికార పార్టీ లో చేరిన ఓ వలస నాయకుని భరోసాతో ఆ వ్యాపారి ఆగడాలకు అడ్డుపడటం లేదనే ఆ రోపనులు బలంగా వినిపిస్తున్నాయి..

యథేచ్ఛగా తరలింపు..

గోదావరి తీరం నుండి దుమ్ముగూడెం, చర్ల నుండి నిత్యం వేలాదిగా పశువులు మల్లెపల్లి గోదావరిరేవు నుండి, ఇక్కడకు వచ్చి భారీ కంటైనర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ తరలించే క్రమం లో వాహనాల్లో పశువులను పరిమితికి మించి ఎక్కిస్తుండంతో కొన్ని గోవులు మృత్యువాత పడుతున్నాయి.  పశువులను అక్రమ రవా ణా అరికట్టాలని గో రక్షణ సమితిలు, హిం దూ సంఘాలు ఎన్ని సార్లు నిరసన కార్యక్రమాలు చేస్తు న్నా.. అధికారులు, ప్రజాప్రతి నిధులకు పట్టడం లేదు.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ఆర్డీవో నుంచి అనుమతి పొందిన వాహనాల్లోనే పశువులను రవాణా చేయాల్సి ఉం టుంది. రవాణా చేసే వాహనాల్లో ప్రత్యేక క్యాబిన్ను ఏర్పాటు చేయాలి.  దున్న లేదా ఆ వును తరలించేందుకు గాను రెండు చదరపు మీటర్ల మేర ఒక్కో క్యాబిన్ను ఏర్పాటు చే యాలి. ప్రత్యేక లైసెన్స్ పొందిన వాహనాల్లో మాత్రమే మూగ జీవాలను తరలించాలి.  ప శువుల తరలింపునకు స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జారీ చేసే సర్టిఫికెట్ తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు పాటించని పక్షంలో వాహనాలను సీజ్ చేయడంతో పాటు సం బంధిత యజమానిపై కేసు నమోదు చేయా ల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవా లని హిందూ సంఘాల నాయ కులు కోరుతున్నారు.