calender_icon.png 1 September, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ రత్నాకర్, ఎం రంగారెడ్డికి మండలి సంతాపం

31-08-2025 12:56:13 AM

సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చైర్మన్ గుత్తా

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు మాజీ సభ్యులు డాక్టర్ టీ రత్నాకర్, తెలంగాణ శాసన పరిషత్తు మాజీ సభ్యులైన ఎం రంగారెడ్డి సంతాప తీర్మానాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాజీ సభ్యుల సేవలను చైర్మన్ గుర్తు చేసుకున్నారు. వారి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేయడంతోపాటు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం తొలిసారిగా శాసనమండలిలో అడు గుపెట్టిన ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభకు పరిచయం చేశారు. కొత్తగా ఎన్నికైన వారిలో ఎమ్మెల్సీలు విజయశాంతి, పింగలి శ్రీపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, సీ అంజిరెడ్డి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మల్క కొమరయ్య ఉన్నారు. అనంతరం మండలిని సోమవారానికి చైర్మన్ వాయిదా వేశారు.