04-05-2025 12:23:36 AM
-నవోదయం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్
ముషీరాబాద్, మే 3 (విజయక్రాంతి) : గిరిజనులను కించపరిచేలా మాట్లాడిన సినీ నటుడు విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలని నవోద యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ పటేల్ డిమాండ్ చేశారు.
శనివారం హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుగులోతు శంకర్ తో కలసి ఆయన మాట్లాడుతూ హీరో సూర్య నటించిన ’రెట్రో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనుల గురించి మాట్లాడుతూ 500 ఏళ్ల క్రితం వారు బుద్ది లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారని వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మా జాతి బిడ్డల ను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.