calender_icon.png 12 December, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంగునూరులో సెల్ టవర్ ఎక్కిన దంపతులు

12-12-2025 12:30:12 AM

నంగునూరు, డిసెంబర్ 11: ఆస్తి పంపకంలో న్యాయం జరగడం లేదంటూ సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన కోల శ్రీకాంత్, వరలక్ష్మి దంపతులు గురువారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కి హాల్ చల్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న శ్రీకాంత్ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. శ్రీకాంత్ తండ్రి కోల రాములు తమ వాటా ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర వివేక్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటన్నర పాటు టవ్ప ఉండి నిరసన తెలిపిన ఆ దంపతులను కిందకు దించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆస్తి సమస్యను పరిష్కరిస్తామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు పదే పదే హామీ ఇవ్వడంతో, ఎట్టకేలకు శ్రీకాంత్, వరలక్ష్మి దంపతులు సురక్షితంగా కిందకు దిగారు. కౌన్సెలింగ్ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.