calender_icon.png 7 October, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుంది

07-10-2025 12:18:04 AM

బీసీల రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 06 ( విజయక్రాంతి ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి సింగిరెడ్డి ని రంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు కే.మాణిక్యం ఆధ్వర్యములో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కా ర్యక్రమం కు ముఖ్య అతిధిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు.

అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీ లు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. బి. సిలను గందరగోళ పరిస్థితులకు గురిచేయడం పట్ల బి.సి.నాయకులు స్పందించకుండా ఉండడం మంచిది కాద ని ఆయన అన్నారు. పదవీకాంక్షతో కోదండరాం బృందం నైతిక విలువలు కోల్పోయారన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు , కార్మికులు,నిరుద్యోగులు తమ తప్పు తెలుసుకున్నారని మరోసారి కె.సి.ఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో భాను ప్రకాశ్ రావు, విజయ్ కుమార్, మతీన్, రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.