27-12-2025 12:54:12 AM
డీఎస్పీ సూర్యనారాయణ
మహాదేవపూర్,డిసెంబర్ 26, (విజయక్రాంతి):కాటారం డీఎస్పీ సూర్యనారాయణ మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు, ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులు, లాటరీలు,కె వై సి మెసేజ్లు, నకిలీ బ్యాంక్ కాల్స్ ద్వారా మోసగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని.
ఎవరైనా అనుమానాస్పద లింకులు పంపితే క్లిక్ చే యకుండా జాగ్రత్తలు పాటించాలి. ఓటీపీ, ఏటీఎం వివరాలు, బ్యాంక్ పాస్వర్డ్లు ఎవరితోనూ పం చుకోకూడదని హెచ్చరించారు.వాట్సాప్లో వచ్చే ఏ పి కె ఫైళ్ళను డౌన్లోడ్ చేయరాదు, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ వ్బుసైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్త్స్ర శశాంక్, పోలీస్ సిబ్బంది, మహా దేవపూర్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.