9 April, 2026 | 3:09 AM

ప్రజల సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటాం

09-04-2026 12:55 AM

భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ

కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రజల సమస్యలపై భారతీయ కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో విరాళాల సేకరణ రెండో రోజు సందర్భంగా మాట్లాడారు.

ప్రజా పోరాటాల కోసం నిత్యం సిపిఐ పోరాడుతుందని పేద, మధ్యతరగతి ప్రజల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. సామాన్యులు జీవించే హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆమె అన్నారు. కార్మికుల, విద్యార్థుల, కర్షకుల, మేధావుల, ప్రశ్నించే గొంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆమె అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు. ప్రజా సమస్య పరిష్కరించుకుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, సిపిఐ నాయకులు ప్రవీణ్, సాయిలు,  ఆముదాల గంగాధర్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సంపత్, శివప్రసాద్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.