calender_icon.png 29 May, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్, మంచినీటి సౌకర్యం కోసం సీపీఎం ధర్నా

27-05-2025 12:42:42 AM

కామారెడ్డి, మే 26,(విజయ క్రాంతి) :  కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలం జంగంపల్లి గ్రామంలో 2008లో గత కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో మూడు సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా  అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు .

ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సహాయమును మహమ్మద్  షబ్బీర్ ఆలీ  మినిస్టర్ ఉన్నపుడు ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాలు ఇళ్ల స్థలాలను అదే ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి మహమ్మద్ షబ్బీర్ అలీ  శిష్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో పాటు పేద ప్రజలను అదిరింపులకు బెదిరింపులకు పాల్పడుతూ మంచినీళ్లు కరెంటు  సౌకర్యాలు రాకుంటా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

గ్రామంలో కొందరు పేద ప్రజలకు స్థలాలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఇది మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా కింది స్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పింది చేయాలని  బెదిరింపులకు పాల్పడుతున్నారని,

ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆర్ గ్యారంటీలు అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను పెంచుకుందని తమ తీరును మార్చుకోకపోతే జంగంపల్లి భూ పోరాట సభ్యులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, నాయకులు పేరం నర్సవ్వ,దేవరాజ్ నర్సింలు బాబ్జాన్ నారాయణ ,లక్ష్మి రమణ బాలప్ప శ్యామల పాల్గొన్నారు