30-08-2025 05:30:24 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా పై సిపిఎం అభ్యంతరం తెలియజేస్తూ గ్రామ పంచాయతీ ఈవోకు వినతి పత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయము నందు శనివారం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పరిచి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియపరచాలని ఎంపీడీవో నారాయణ, ఈవో శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాను పరిశీలించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామిలు మాట్లాడుతూ... 20వ వార్డు ఓటర్ల జాబితాలో అవార్డులోని ఓటర్లతో పాటు గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా చేరిన ఓట్లు అన్నింటిని 20వ వార్డులో చేర్చడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఏ వార్డులో చేరిన కొత్త ఓట్లను అవార్డులోనే పొందుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వ్రాతపూర్వకంగా తెలియజేసిన అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితాలో సరిచేయాలని వారు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి,ఎం నాగరాజు, డి కనక శ్రీ, జోన్ కన్వీనర్ డి రామకృష్ణ తదితరులు ఉన్నారు.