calender_icon.png 31 August, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హతిరం బాబా మఠంను తొలగిస్తే తీవ్ర పరిణామాలు!

30-08-2025 05:28:37 PM

గాంధారి (విజయక్రాంతి): త్రిత్మక ఘట్టం అయిన తిరుపతిలోని హతిరం బాబా మఠం(Hathiram Baba Math)ను తొలగిస్తే తివ్రపరిణామాలు ఎదుర్కోవాలసి వస్తుందని కామారెడ్డి జిల్లా బంజారా సంస్కృతి పరిరక్షణ సభ్యులు లక్ష్మణ్ రాథోడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన హతీరం బాబా శ్రీ వేంకటేశ్వర స్వామితో పాచికలాడినా చరిత్రను మరచిపోయారా, తిరుపతి స్వామితో సరసన దైవ సంకల్పం కలిగిన ఆయన మఠంనూ తొలిగిస్తే గతంలో ఏడు గుట్టలను ఒకటే చేస్తా అన్న వాళ్ళు పావురాల గుట్టలో కనుమరుగు అయిన సంగతి మరచిపోవద్దు అన్నారు.

మఠంను తొలగించే ప్రయత్నం మానుకోవాలన్నారు, బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్నికి చిహ్నంగా తమ కుల ఆధ్యాత్మికమైన మఠంను కష్యపురితంగానే తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పూనుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలన్నారు. ఒక వేల రునరుద్దరణ చేయాలనుకుంటే ముందుగా లిఖిత పూర్వకంగా బాండ్ పెపర్ పై రాసి ఇవ్వాలన్నారు, ఇప్పటికీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కిరటం కంటే ఎత్తైన హతిరం బాబా మందిరమును యదవిధిగానే నిర్మించాలన్నారు, ఒక జాతికి  అవమనం కలిగించే అంశన్ని అక్కడి ప్రభుత్వం పునరలోచించాలని డిమాండ్ చేశారు.