calender_icon.png 24 August, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి కాకపోగా.. అలా ఆలోచించే వ్యక్తి కథ ఇది

24-08-2025 01:24:48 AM

నారా రోహిత్ మైల్‌స్టోన్ 20వ చిత్రం ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు వెంకటేశ్ మీడియాకు చిత్ర విశేషాలను చెప్పారు. “-నాకు ఫ్యామిలీ కథలు ఇష్టం. ‘కలిసుందాం రా’ నా ఫేవరెట్ సినిమా.

నా ఫస్ట్ సినిమాను క్యూట్ ఫ్యామిలీ లవ్‌స్టోరీగా చేద్దాం అనుకున్నా. నా ఆలోచనను రోహిత్‌కి చెప్పాను. కథ రాసి పంపిస్తే ఆకర్షితులయ్యారు. అలా ప్రాజెక్టు మొదలైంది. వయసు 30 దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కోనే పర్సన్ ఉంటే..? వాళ్లింట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదనే ఆలోచనలో నుంచి ఈ కథ పుట్టింది. -రామాయణంలో హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్లి రాముడి ఉంగరాన్ని చూపించే ఘట్టం సుందరకాండ.. అదొక సెలబ్రేషన్. దానికి ముందు హనుమంతుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. అలా మా హీరో కూడా ఒక విషయంపై శ్రద్ధ పెడతాడు.

దానికోసం ఏం చేశాడన్నదే కథ. అందుకే ఈ సినిమాకు ‘సుందరకాండ’ అనే టైటిల్ పెట్టాం. రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపు ఉన్న లవ్‌స్టోరీ ఇది. రోహిత్ కంటే ఏజ్డ్‌గానూ, బ్యూటిఫుల్‌గానూ ఉండే అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్నాం. నాకు కామెడీ చాలా ఇష్టం. అయితే రాయడం అంత ఈజీ కాదు. కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం. లక్కీగా మాకు చాలా అద్భుతమైన నటులు దొరికారు. -సత్య, సునయన క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సత్యది కామెడీ అని కాకుండా కథలో కీలక పాత్ర. ప్రతి పాత్రా వినోదం పంచుతుంది. ఫ్యామిలీ అందరితో కలిసి చాలా హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.