calender_icon.png 22 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం సత్తా చాటాలి: పోతినేని

22-08-2025 01:57:01 AM

ఎర్రుపాలెం ,ఆగస్టు 21 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి నల్లమోతుల హనుమంతరావు అధ్యక్ష తన నిర్వహించగా సమావేశానికి ముఖ్య అ తిథిగా విచ్చేసిన పోతినేని మాట్లాడుతూ అ మెరికా దేశంలో ఎన్నికలు జరిగితే మన దేశ ప్రధాని మోడీ ట్రంప్ గెలుపు కోసం ప్రచా రం చేశారని ఫభారతీయులంౠదరూ ట్రంప్ కు ఓట్లు వేసి అమెరికా అధ్యక్షుడుగా గెలిపిస్తే భారత్ ఎగుమతి చేసే వస్తువుల పై న పన్నులు వేస్తానని హెచ్చరిస్తున్నాడని ట్రంపు నా స్నేహితుడు అని చెబుతున్న మో డీ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు.

ట్రంప్ వే సే పన్నుల భారం వలన భారత ప్రజలతో పాటు రైతులు నష్టపోతున్నారని ఆత్మహత్య లు చేసుకుంటుౠన్నారని అన్నారు.  ర ష్యా దేశం వద్ద ఆయిల్ కొనవద్దని కొంటె ప న్నులు వేస్తానని బెదిరిస్తున్న ట్రంపు మాత్రం వారి దేశానికి కావలసిన ఫెర్టిలైజర్స్ తదితర వస్తువులు కొనవచ్చ అని అన్నారు.రష్యా వద్ద మనం 30% ఆయిల్ కొనుగోలు చేస్తే అమెరికా మాత్రం 45% కొనుగోలు చేస్తుందని తెలిపారు.

చైనా దేశాన్ని పన్నులు వేస్తా నని బెదిరిస్తే వేసుకో నీ ఇష్టం అని ఆ దేశ ప్రధాని అనడంతో దెబ్బకు దిగి వచ్చాడని తెలిపారు. ట్రంపు బెదిరిస్తే మోడీ వణుకుతున్నాడని నోటి నుండి మాటలు పే గలటం లేదని ఎవిమర్శించారు. ప్రజలకు కష్టం వస్తే కనిపించేది కమ్యూనిస్టులే అని ఎక్కడ కష్టం ఉన్న అక్కడ కమ్యూనిస్టులు తప్పక ఉంటారని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటారని తెలిపారు.

ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పని చేయవని ఎవ రు సహాయం చేస్తారో వారిని గుర్తుంచుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజె పి బలపడాలని చూస్తుందని దానిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటూ ప్రచారం చేసిన భట్టి విక్రమార్క ప్రజలకు సంతకం పెట్టి 6 గ్యారంటీల కార్డు ఇచ్చి భద్రపరచుకోమన్నారని ఇప్పుడు ఆ కార్డును ఏం చేసుకోవాలో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

మహిళలకు గృహలక్ష్మి పథకం ద్వారా 2,500 వందల రూపాయలు ఇస్తానని రెండు సంవత్సరాలకు 60,000 వేల రూపాయలు రావాలని అవి ఇవ్వకుండా 60 రూపాయల ఫ్రీ బస్ టికెట్ ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారని ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది మహిళలను కోటీశ్వరులను చేశారో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన పేరుతో గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు సేకరించారని ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు ఏమయ్యాయని ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ అనుయాయులకు మాత్రమే ఇళ్లను మంజూరు చేశారని ఇది మీ సొమ్మ ప్రజా సొమ్మని విమర్శించారు. మహానుభావుడు స్వర్గీయ కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు గతంలో సిపిఎం పార్టీ కార్యకర్తలకే ఇల్లు కేటాయించారా అని అడిగారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు, గొల్లపూడి కోటేశ్వరరావు, సగుర్తి సంజీవరావు, షేక్ లాల, దూదిగం బసవయ్య, మేడగాని తిరుపతిరావు, షేక్ నాగులమీర, నాగులవంచ వెంకట్రామయ్య, మందడపు ప్రభాకర్, రావు రాములు, చిత్తారు కిషోర్, కూడెల్లి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.