02-12-2025 01:30:28 AM
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ (హెచ్ రూ. 673.60 కోట్లు, ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణకు రూ. 125 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ. 2.61 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్ కేటాయించిన నిధులను జీహెచ్‌ఎంసీకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కాంపేన్సేషన్ కింద చెల్లించేందుకు గానూ విడుదల చేసినట్టు ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. మెట్రోకు కేటాయించిన నిధులను మెట్రో రైల్ సౌకర్యాన్ని ఓల్డ్ సిటీ వరకు విస్తరించేందుకు వినియోగించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీకి కేటాయించిన నిధులను ఆయా ప్రాంతాల్లో భూసేకరణ కోసం విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.