02-12-2025 01:29:50 AM
-హాజరుకానున్న సీఎం, మీనాక్షినటరాజన్
-స్థానిక ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీగా హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తు న్నారు. అందులో భాగంగా మంగళవారం గాంధీభవన్‌లో ఉదయం 10 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన కొత్తగా నియమించబడిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యద ర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్‌తో పాటు పార్టీ సీనియర్లు హాజరుకానున్నారు. కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులతో మొదటిసారి సమావేశం కానుండటంతో వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై పార్టీ నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు.