calender_icon.png 2 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

43 కోట్ల మందికి వినికిడి సమస్య

02-12-2025 01:41:00 AM

-కాక్లియర్ ఇంప్లాంట్ల అమరికే సరైన పరిష్కారం

-కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ప్రపంచ జనాభాలో దాదాపు 43 కోట్ల మంది పాక్షికంగా, లేదా పూర్తిగా వినికిడి సమస్యతో బాధపడుతున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా అని, 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 70 కోట్లకు చేరుకుంటుందని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన 2025 కాక్లియర్ ఇంప్లాంట్ కిడ్స్ మీట్ ఆయన మాట్లాడారు.

శిశువు జన్మించినప్పుడే ఏమీ వినపడకపోతుంటే దాన్ని జన్మతః వచ్చిన వినికిడిలోపం అంటా రు. దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, తగిన చికిత్స చేయించాలి అన్నారు. సాధారణంగా వినికిడి 90% లేదా అంతకంటే ఎక్కువ దెబ్బతింటే కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టించడమే ఉత్తమ చికిత్స. ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీనివల్ల చెవుడు ఉన్నవారు, లేదా తీవ్రమైన వినికిడి లోపం ఉన్నవారికి శబ్దాలు వినపడతాయి అన్నారు.

మన దేశంలో మాత్రం ఇప్పటివరకు సుమారు 35వేల నుంచి 40 వేల వరకు మాత్రమే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. మొత్తం బాధితుల్లో 5%కు మాత్రమే సరైన చికిత్స అందుతోందని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి ఒక మాదిరి నుంచి తీవ్రమైన వినికిడి సమస్య ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల కింద కాక్లియర్ ఇంప్లాంట్లు అందిస్తోందన్నారు. కాక్లియర్ ఇంప్లాంట్ కిడ్స్ మీట్ వాళ్లంతా కుటుంబసభ్యులతో సహా పాల్గొన్నారు.

వీళ్లలో సుమారు 80 మంది వరకు పాటలు, నృత్యాలు, స్కిట్లు, కథలు చెప్పడం.. ఇలాంటి పలు కార్యక్రమాలు ప్రదర్శించారు. కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, “కాక్లియర్ ఇంప్లాంట్ టెక్నాలజీలో అత్యాధునిక మార్పులు వచ్చాయి. వినికిడి సంబంధిత సమస్యలన్నింటికీ కాక్లియర్ ఇంప్లాంట్ల అమరికే సరైన పరిష్కారం అన్నారు.

కార్యక్రమంలో ఇంకా కాక్లియర్ ఇంప్లాంటేషన్ రంగంలో నిపుణులు డాక్టర్ జగిని జనార్దనరావు, డాక్టర్ రేవూరి మహేష్ కుమార్, డాక్టర్ బి.ఎ. ఆశ, డాక్టర్ బొడ్డుపల్లి శివప్రసాద్, డాక్టర్ రాయపాటి దీక్ష, డాక్టర్ దివ్య పాల్గొన్నారు.