calender_icon.png 2 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద హైస్కూల్‌లో కంటి పరీక్షలు

02-12-2025 01:39:52 AM

-లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఉషోదయ కాలనీ వివేకానంద హైస్కూల్‌లో లయన్ క్లబ్ వై కిషన్రావు బాలానగర్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులు, స్థాని కులకు లయన్స్ క్లబ్ హైదరాబాదు స్టాల్వాట్స్, డిస్టిక్ 320బీ రీజియన్ వారు ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశారు.

లయన్ రేస్ మల్లారెడ్డి, లయన్ ప్రకాష్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ అవంతిరెడ్డి, స్కూల్ కొరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మల్లారెడ్డి స్వయంగా కళ్లజోడులను పంపిణీ చేశారు. ఎన్నో మందికి చూ పు ప్రసాదిస్తూ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో స్టాల్వాట్స్ ప్రెసిడెంట్ పద్మావతి, లయన్ శ్రీధర్ బాబు, లయన్ స్టాల్వాట్స్ జిల్లా గవర్నర్ విచ్చేసి పాల్గొన్నారు. 7, 8, 9, 10వ తర గతి విద్యార్థులతో ప్రత్యేక యాక్టివిటీలు నిర్వహించారు. టీచర్లు వాసవి, దీపిక, మంజుల, మీనా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా, కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.