calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా భవనానికి రూ.2 కోట్లు మంజూరు

24-09-2025 12:37:47 AM

ఎమ్మెల్యేను సన్మానించిన గిరిజన నాయకులు

నారాయణఖేడ్, సెప్టెంబర్ 23: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తాలో కల బంజారా సేవాలాల్ రామ్రవ్ మహారాజ్ ట్రస్ట్ స్థలంలో బంజారా భవన నిర్మాణానికి ప్రభుత్వం రూపాయలు రెండు కోట్లు మంజూరు చేయడంతో స్థానిక బంజారా నాయకులు, సేవాలాల్ మహారాజ్ దీక్షదారులు కలిసి స్థానిక ఎమ్మెల్యే పి సంజీవరెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పి. చంద్రశేఖర్ రెడ్డి లకు మంగళవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య మైందని అన్నారు. రామ్ రావ్ మహారాజ్ ట్రస్టు నిర్మాణంకు నిధులు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు, జహిరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ ధిక్షదారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.