24-09-2025 12:37:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): “మనమందరం కలసికట్టుగా పని చేసి త్వరలో జరగనున్న జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధిద్దాం” అని శ్రీనగర్ డివిజన్ ఇన్‌చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రమ ణ బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పర్యవేక్షణలో మంగళవారం యూసఫ్‌గూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీనగర్ కాలనీ డివిజన్ స్థాయి సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బూత్ స్థాయి ఇన్‌చార్జిలకు దిశా నిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని, మాగంటి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి మాగంటి సునీతమ్మ విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని సూచించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు.