calender_icon.png 19 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలకుల తప్పిదాల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది

19-05-2025 12:32:27 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ 

కరీంనగర్, మే18(విజయక్రాంతి): గత పాలకుల తప్పిదాల వల్ల, నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని దా నికి పారదర్శ పాలన చేస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడమేంటని సుడా చైర్మన్ కో మటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

కరీంనగర్ కళలతో కళాకారులతో అభివృద్ధి సంక్షేమంతో కలకలలాడుతుందని పచ్చ కామెర్లోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోందని బిఆర్‌ఎస్ శాసనసభ్యులు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లను మాజీ బిఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి  నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా అర్హులకు మాత్రమే ఇచ్చే విధంగా ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతుందని అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని గత బిఆర్‌ఎస్ పాలనలో ఏపథకమైనా పింక్ చొక్కాలకు మాత్రమే వర్తించేదని నిజమైన అర్హుల కు అన్యాయం జరిగిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ కోసం ఆరు కోట్లు ఖర్చు పెట్టారని టెండర్ ప్రక్రియలో దాని భాధ్యత భద్రత మరచిపోవడం వల్ల వెలిగించిన నెల రోజుల్లోనే విలువైన సామగ్రి దొంగల పాలయ్యాయని దానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడమేంటని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ నాయకుల వైఖరి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఉమ్మడి జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బా బు,పొన్నం ప్రభాకర్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో దన్నసింగ్,జిడి రమేష్, కోడూరి రవీందర్ గౌడ్,బత్తిని చంద్రయ్య,మార్క రాజా గౌడ్, నదీమ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.