12-09-2025 12:28:37 AM
స్కూల్ యాజమాన్యం వల్లే తమ కొడుకు మరణించాడని తల్లిదండ్రుల ఆరోపణ
కేసు నమోదు చేసిన పోలీసులు
హనుమకొండ సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): హనుమకొండ పట్టణంలోని న యీంనగర్ తేజస్వి స్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ (15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రోజులాగే గురువాం ఉదయం స్కూల్ కి వెళ్ళిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్లు కుటుంబ స భ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించారు.
బాలుడి ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని, యాజమాన్య మే విద్యార్థిని కొట్టి చంపేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. జయంత్ వర్ధన్ తండ్రి రవి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి మోడల్ స్కూ ల్‌లో ఉపాధ్యాయురాలు స్వస్థలం దేవ న్నపేట, ప్రస్తుత ని వాసం హనుమాన్ నగర్, హనుమకొండ నయీంనగర్ తేజస్విపాఠశాలలో గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో విద్యార్థులు ఆటలు ఆడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా పడిపోవడం జరిగిందని,
తోటి విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది కలిసి దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పాఠశాలలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించడం వల్లే తమ కొడుకు మరణించాడని, విద్యార్థి తల్లిదండ్రులు హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చీకటి శివకుమార్ తెలిపారు. అంతకుముందు పాఠశాల యాజమాన్యం వల్లే విద్యార్థి మరణించాడని ఆరోపిస్తూ సంఘాల నాయకులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు.