12-09-2025 12:26:55 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): వరుసగా కఠిన తీర్పులతో కామాంధులకు నల్లగొండ పోక్సో కోర్టు దడ పుట్టిస్తుంది. న్యాయమూర్తి రోజా రమణికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో కట్టంగూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన జడిగల హరీష్‌కి గురువారం న్యాయమూర్తి రోజా రమణి 376(2)(I) సెక్షన్ కింద 21 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధించారు.
వివరాలలోకి వెళితే కట్టంగూర్ మండ లం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీష్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలు 2018 జూలై23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీసులు సమర్పించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కీలకంగా మారింది.