calender_icon.png 19 May, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

19-05-2025 12:31:44 AM

రాజేంద్రనగర్, మే 18: ఓ ఫ్లాట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్ర మాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌ఐ పైడి నాయుడు కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ మొఘల్ కాలనీలో హౌస్ నంబర్ 8-2-11/6/63/పి చిరునామాలో గల గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తులు, పెంట్ హౌస్ ఉన్న అపార్ట్మెంట్ భవనంలో ఉదయం సుమారు 7:18 గంటలకు ఓ ఫ్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు చెలరేగాయి.

ఫైర్ కంట్రోల్ రూమ్కు కాల్ వచ్చిన వెంటనే చంద్రాయణగుట్ట ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను సుమారు గంటన్నర కష్టపడి  ఆర్పేశారు. ప్రమాదం జరిగిన భవనంలో ఆరేడు కుటుంబాలు నివసిస్తున్నాయి.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సుమారు పదిమందికి భవనం పైకి వెళ్లారు.  వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ నరేందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ఈ ప్రమాదం జరగలేదని చెప్పడం గమనార్హం.