calender_icon.png 12 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో.. ప్రభుత్వ కాంట్రాక్టా!

12-09-2025 12:24:58 AM

- రెండేళ్లుగా రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్ 

- ఆర్ డబ్ల్యు ఎస్ పనులు చేయాలంటే ముందుకు రాని కాంట్రాక్టర్లు

 గజ్వేల్, సెప్టెంబర్ 11: కాంట్రాక్టర్లు ప్రభు త్వ పనులు అంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టు అనగానే పోటీ పడి మరి టెండర్లు వేసే కాంట్రాక్టర్లు ప్రస్తు తం అధికారులు పనులు చేయాలని బతిమిలాడినా కూడా అమ్మో ప్రభుత్వ కాంట్రాక్టా అం టూ చేతులెత్తేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ (ఆర్ డబ్ల్యు ఎస్ ) కు చెందిన వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు రూ. 3 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి.

అధికారులు వివిధ గ్రామాల్లో ఏవై నా మరమ్మత్తులు అవసరమైతే కాంట్రాక్టర్లను నిన్న మొన్నటి వరకు బ్రతిమిలాడి ప నులు చేయించారు. కానీ ప్రస్తుతం పనులు నిర్వహించాలంటే భయపడుతున్నారు. ఇప్పటికే ఒక్కో కాంట్రాక్టర్కు ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా ప్రభుత్వం లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా జిల్లావ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల వరకు బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. అధికారులను కాంట్రాక్ట ర్లు ఎన్నిసార్లు బిల్లుల గురించి అడిగినా వ స్తాయని చెప్పడమే తప్ప రెండేళ్లయినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పు ల పాలవుతున్నారు.

గడిచిన వేసవికాలంలో తాగునీటి సరఫరాకు అవసరమైన పనులు, మరమ్మత్తులు చేయించడానికి అధికారులు ఎంత బ్రతిమిలాడినా కాంట్రాక్టర్లు ముందు కు రాలేదు. గ్రామాల్లో పంచాయతీ నిధులు కూడా లేకపోవడంతో గ్రామపంచాయతీ కా ర్యదర్శులు సైతం తాగునీటి సరఫరాకు ఇ బ్బందులు పడ్డారు. ఇటీవల మల్లన్న సాగర్ ద్వారా తాగునీరు సరఫరా అవుతుండడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అ యితే భవిష్యత్తులో  కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయాల్సిన అవసరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేనిపక్షంలో ప్రభుత్వ పనులు అంటేనే కాంట్రా క్టర్లు పట్టించుకోని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. 

రెండేళ్లయిన డబ్బులు రాలేదు, అప్పులు చేసి వడ్డీలు కడుతున్నాం  

 ఆర్ డబ్ల్యూ ఎస్ మిషన్ భగీరథ పనులు అధికారులు ఎప్పుడు చె ప్పినా వెంటనే పూర్తి చేసాం. కానీ రెండేళ్లు అయినా కూడా బిల్లులు రావడం లేదు. పనిచేసిన డబ్బులు రాకపోగా బయట తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులను ఎన్నిసార్లు అడిగినా కూడా వస్తాయని చెబుతున్నారు తప్ప వచ్చిన దాఖలాలు లేవు. నాతో పాటు పంచాయతీరాజ్ తదితర శాఖల ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్లు అందరూ అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధను గుర్తించి వెంటనే బిల్లులు చెల్లించాలి. లేనిపక్షంలో ప్రభుత్వ పనులు చేయడానికి ఎవరూ కూడా ఆసక్తి చూపే పరిస్థితుల్లో లేరు.

- పాండు, కాంట్రాక్టర్