calender_icon.png 12 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విద్యుత్ స్తంభాల’తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

12-09-2025 12:24:44 AM

  1. స్తంభాలు మీద పడి ఇద్దరు దుర్మరణం
  2. బోధన్ మండలం కల్దుర్కి సిద్ధాపూర్‌లో ఘటన

బోధన్, సెప్టెంబర్ 11: (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు పంచాయతీ సిబ్బంది మృతి చెందారు. బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కిసిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేరుగా పంచాయతీ సిబ్బందిపై పడటంతో అక్కడికక్కడే  వారు మృతి చెందగా, డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అధికారిక పనుల్లో భాగంగా ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనపై బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.