04-10-2025 12:00:00 AM
ఎల్బీనగర్, అక్టోబర్ 3 : ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో గురువారం, శుక్రవారం దసరా పండుగ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు విజదశమి (దసరా) రోజున కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఉన్న దుర్గాదేవి గురువారం రాజరాజేశ్వరీదేవి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో చండీహోమం, పూర్ణాహుతి, శమీపూజ, రావణ దహనం నిర్వహించారు.
ఆయా కార్యక్రమాల్లో సుమారు 20000 మందికి పైగా భక్తులు పాల్గొని ఆలయంలో శమీ పూజ, రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించించారు. ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, పాలక మండలి చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గారెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కవిత, ఓరుగంటి నరేశ్, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.