calender_icon.png 2 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మన్‌ఘాట్ ఆలయంలో భక్తుల సందడి

02-01-2026 12:55:43 AM

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు 

ఎల్బీనగర్, జనవరి 1: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. 2026 సంవత్సరాదిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 50వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఈవో లావణ్య, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గారెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కవిత, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.