02-01-2026 12:54:49 AM
అలంపూర్, జనవరి 1: దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని దీన్ని బట్టి చూస్తే గ్రామ పాలన ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఉందని కాబట్టి గ్రామ ప్రగతికి కోసం అందరూ సమన్వయంతో తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.గురువారం ఇటిక్యాల మండలం ఊదండపురం గ్రామ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ ఉపసర్పంచుగా జక్కుల యుగంధర్ ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని నాయకుడిగా కాకుండా సేవకుడిగా గ్రామస్తులకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా గ్రామస్తులు పలువురు ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.